దత్ కి అమెరికాలోనే ట్రీట్మెంట్

- Advertisement -
Sanjay Dutt as Adheera in KGF2

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి అమెరికా వీసా దక్కింది. ఐదేళ్ల పాటు అమెరికా వీసా వచ్చింది. మెడికల్ ట్రీట్మెంట్ కోసం అంటూ ప్రత్యేకంగా దత్ కుటుంబ సభ్యులందరికి వీసా ఇచ్చారట.

సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్ అని తేలింది. దాంతో అమెరికాలో చికిత్స కోసం వెళ్తున్నాడు. మొన్నటివరకు ముంబైలోనే ట్రీట్ మెంట్ జరిగింది. ఐతే, అమెరికాలో అయితే ఇంకా బెటర్ ట్రీట్ మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు. వచ్చే వారం షిఫ్ట్ అవుతాడట. భార్య మాన్యత, ఆయన సోదరి ప్రియాంక కూడా సంజయ్ దత్ తో అమెరికా వెళ్లనున్నారు.

రిషి కపూర్, సోనాలి బెంద్రే వంటి స్టార్స్ కూడా అమెరికాలోనే చికిత్స చేయించుకున్నారు.

సంజయ్ దత్ నటిస్తున్న “కే.జీ.ఎఫ్ 2” సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఇందులో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. కానీ దత్ కి సంబంధించిన సీన్లు అన్ని ఇప్పటికే తీసేశారట. ఒక ఎపిసోడ్ ని మాత్రం పక్కన పెట్టారు. అది తీయకపోయినా సినిమాలో పెద్దగా మార్పు ఉండదంట. ఆయన ఎలాగూ ఇప్పుడు షూటింగ్లో పాల్గొనే పరిస్థితి లేదు. అందుకే దాన్ని తొలగించారు తమ స్క్రిప్ట్ నుంచి.

ఇక సంజయ్ దత్ ని ఒక బడా తెలుగు సినిమాలో నటింపచేయ్యాలని ప్రయత్నిస్తున్న మేకర్స్ కి ఇది షాక్.

 

More

Related Stories