‘కంగనా ఒక మెంటల్ కేస్’

Kangana Ranaut

మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవకి దిగింది కంగనా రనౌత్. సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత… కంగనా ముంబై పోలీసుల విచారణపై మొదట ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ కేసులో ఉన్నట్లు మాట్లాడింది. దాంతో… అప్పటి నుంచి ఆమెను ఓ రేంజులో ఆడుకుంటున్నారు శివసేన నేతలు.

తాజాగా… ముంబై పోలీసులు తనకి రక్షణ కల్పించలేరని, కేంద్ర ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని కోరింది. అలాగే, ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మారిందని కామెంట్ చేసింది. దాంతో శివసేన ఫైర్ బ్రాండ్ నేత సంజయ్ రౌత్ కి కోపం నషాళానికి ఎక్కింది. “కంగనా గురించి మాట్లాడడం వేస్ట్. ఆమె ఒక మెంటల్ కేస్,” అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో కంగనా మరింతగా రెచ్చిపోయింది. శివసేన తాలిబాన్ గా మారింది అన్నట్లుగా మాట్లాడింది. అంతేకాదు, సెప్టెంబర్ 9న ముంబైకి బయలుదేరుతున్నాను. దమ్ముంటే ఎవరు ఆపుతారో ఆపండి అంటూ బస్తీమే సవాల్ విసిరింది.

ఐతే, ముంబై గురించి ఆమె చేసిన కామెంట్లు తమ పార్టీకి ఇబ్బందే అని కంగనా భుజం మీది నుంచి శివసేనపైకి తుపాకీ ఎక్కిపెట్టిన బీజేపీ ఇప్పుడు కలవరపెడుతోంది.

శివసేన ఇప్పటికే కంగన మాటలతో తమ పార్టీని మహారాష్ట్రలో బద్నామ్ చేసింది అని బీజేపీ గ్రహించింది. వెంటనే రంగంలోకి దిగి, కంగన మాటలను ఖండించింది. “ముంబై, మహారాష్ట్ర ప్రజలకు కంగనాతో నీతులు చెప్పించుకోవాల్సిన గతి పట్టలేదు,” అని బీజేపీ లీడర్ ప్రకటించారు.

Advertisement
 

More

Related Stories