కొలొంబో వెళ్లే స్టార్స్ పై నిఘా!

Sanjjanaa,

బెంగుళూరులో డ్రగ్స్ ముఠాని పట్టుకోవడం వెనుక పెద్ద కసరత్తు జరిగిందిట. హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలు అరెస్ట్ కావడం అనేది చిన్న పాయింటేనట. అసలు టార్గెట్… డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను పట్టుకోవడమే.

గత కొన్నేళ్లుగా కొలొంబోలో కాసినో వ్యాపారం బాగా పెరిగింది. ఆ కాసినొ వ్యాపారంలో పెట్టుబడులు… కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందినవారివే అధికంగా ఉన్నాయని కేంద్ర గూఢచార సంస్థలు గ్రహించాయి. అలాగే వీటికి ఎక్కువగా వెళ్ళేది కూడా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వారే అని తేలిందట. అలాగే మన దక్షిణాది రాష్ట్రాలు నుంచి కొలొంబో కాసినోలకు డ్రగ్స్ సప్లై బాగా జరుగుతోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) గ్రహించింది. దాంతో ఏడాది కాలంగా నిఘా పెట్టారట.

రాగిణి, సంజనల పాత్ర చిన్నదే అని అసలు మాస్టర్ మైండ్స్ ని పట్టుకునే ప్రయత్నం చేసున్నామని కర్ణాటక హోమ్ మంత్రి చెప్పారు. అంటే… మన టాలీవుడ్ నుంచి రెగ్యులర్ గా కొలొంబో వెళ్లే నిర్మాతలు, నటులు, దర్శకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన టాలీవుడ్ ప్రముఖుల మీద కూడా నిఘా ఉండొచ్చు…!

Related Stories