సంజన డ్రగ్స్ కేసులో ‘విచిత్రాలు’

Sanjana

కన్నడ చిత్రసీమకి సంబందించిన డ్రగ్స్ కేసులో కొన్ని గమ్మత్తైన విషయాలు వెలుగులోకి వచ్చాయని కర్ణాటక మీడియా చెప్తోంది. ఈ కేసులో రాగిణి ద్వివేది, సంజన గల్రానిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఇద్దరినీ సాధారణ ఖైదీలుగానే జైలులో ఉంచారు. ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. ఐతే, సంజనకి వ్యతిరేకంగా ఇప్పటివరకు సరైన అధరాలు నార్కోటిక్స్ టీంకి దొరకలేదట.

  • సంజనకి కోట్లాది ఆస్తులు, 10 అపార్టుమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె సినిమాల ద్వారా సంపాదనకు, ఆమె కూడబెట్టిన ఆస్తులకు లింక్ కలవడం లేదు. ఐతే, ఇది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ చూసుకోవాల్సిన విషయం. డ్రగ్స్ ముఠాతో ఆమెకి లింక్ ఉందని చెప్పేదానికి ఈ ఆధారం కోర్టులో చెల్లదు.
  • ఈ కేసులో ఆమె ఇప్పుడు A14. అంటే మెయిన్ నిందితుల లిస్ట్ లో ఆమెది 14వ స్థానం. బలమైన కేసు కాదు.
  • డ్రగ్స్ ముఠాగా భావిస్తున్న ప్రకాష్, రాహుల్ నిర్వహించిన పలు పార్టీల్లో ఆమె పాల్గొన్నట్లు ఆధారాలున్నాయి. ఐతే, ఆమె ఈ పార్టీల్లో కానీ, మామూలు సందర్భాల్లో కానీ డ్రగ్స్ వినియోగించినట్లు (తీసుకున్నట్లు) కానీ, అమ్మినట్లు కానీ ఎవిడెన్స్ పోలీసులకు ఇంకా చిక్కలేదు.
  • ఆమె కూడా డ్రగ్స్ అమ్ముతుందని ప్రకాష్ రాంకా చెప్పిన మాటల ప్రకారం సంజనని అరెస్ట్ చేశారు. ఆమె అమ్మినట్లుగా మాత్రం ఇంకా ఆధారాలు దొరకలేదు.
  • సంజన ఇంట్లో ఆమెకి సంబంధించిన ఐదు మొబైల్ ఫోన్లు దొరికాయి. అందులో రెండింటికే మాత్రం సిం కార్డులున్నాయి. మిగతా మూడింటికి సిం కార్డులు దొరకలేదు. రెండు మొబైల్స్ డాటాలో ఆమె డ్రగ్స్ విక్రయం చేసినట్లు రుజువులు లభించలేదు.

Related Stories