సంజన బ్యాంక్ ఖాతాల్లో డబ్బు ఏమైంది?

Sanjana

సీసీబీ దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజనా గల్రానీ బ్యాంక్ ఖాతాల్నీ ఈడీ పరిశీలించింది. ఖాతాలన్నీ చూసిన తర్వాత ఖంగుతినడం ఈడీ వంతయింది.

అవును.. సంజన ఖాతాల్లో కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సంజనకు ఏకంగా 11 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులకు కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అరెస్ట్ అవ్వడానికి సరిగ్గా 4 వారాల ముందు నుంచి సంజనా ఖాతాల్లో సొమ్ము.. ఇతర ఖాతాల్లోకి వరదలా పారిందట.

దాదాపు 3 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు నడిచినట్టు గుర్తించిన ఈడీ అధికారులు, వీటిపై సంజనను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఐఎంఏ సంస్థలో పెద్ద మొత్తంలో బంగారంపై సంజనా పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు.

ఈ మొత్తాలపై ఈడీ అడిగిన ప్రశ్నలకు సంజన, అస్పష్టంగా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ అమ్ముకొని డబ్బు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని.. సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్, ఫొటో షూట్స్ ద్వారా తను బాగా సంపాదిస్తున్నానని సంజన అధికారులకు తెలిపిందట. 

Advertisement
 

More

Related Stories