విద్యుత్ తో ఘాజీ దర్శకుడు

Sankalp Reddy and Vidyut

ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో తన లక్ ని టెస్ట్ చేసుకుంటున్నాడు. ‘ఘాజి’ సినిమాతో బాలీవుడ్ లో కూడా పేరు సంపాదించాడు సంకల్ప్. దాంతో ఒక బాలీవుడ్ కార్పొరేట్ నిర్మాణ సంస్థ అతనితో ఒప్పందం కుదుర్చుకొంది. ఆ సంస్థ … యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ ని హీరోగా తీసుకొంది. విద్యుత్ …సంకల్ప్ చెప్పిన కథకి ఓకే చెప్పాడు

సంకల్ప్ తన రెండో సినిమాగా తీసిన ‘అంతరిక్షం’ నిరాశ పర్చడంతో తెలుగులో మరో సినిమాని ప్రకటించలేదు. ఐతే ఈ టాలెంటెడ్ కుర్రాడిని బాలీవుడ్ ఆహ్వానం పలికింది.

కరోనా క్రైసిస్ ముగిసిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. సంకల్ప్ ఇప్పటికే … లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో ఒక కథ డైరెక్ట్ చేశాడు. ఈ కథలో ఈషా రెబ్బ నటించింది.

Related Stories