ప్రకటనలేనా? నిజంగా వస్తాయా?

- Advertisement -

కరోనా కారణంగా ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. విడుదల తేదీలు ప్రకటించడం, మళ్ళీ వాయిదా వెయ్యడం చూస్తూనే ఉన్నాం. ఒక కేసుల వేవ్ ముగిసిందనుకుంటున్న టైంలో ఇంకోటి వచ్చి పడుతోంది. హైదరాబాద్ లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే… సంక్రాంతి పండక్కి వస్తాయని చెప్తున్న సినిమాలన్నీ నిజంగా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.

ప్రస్తుతానికి మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 13, 2022 అని పోస్టర్ లో డేట్ పడింది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ డేట్ కూడా వచ్చేసింది. జనవరి 14, 2022… దాని విడుదల తేదీ.

పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ మూవీ కూడా సంక్రాంతి బరిలో ఉండనుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ చెప్పలేదు. డేట్ కూడా ప్రకటించలేదు. జనవరి 12, 2022 అనే డేట్ అనుకుంటున్నట్లు సమాచారం. వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ “F3” కూడా జనవరి 12 కానీ, జనవరి 14 కానీ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఐతే, ఇప్పుడు నిర్మాతలు హడావిడి చేస్తున్నా… అసలు టైం వచ్చేటప్పటికి అప్పటి పరిస్థితులను బట్టి ఇందులో కొన్ని సినిమాలు డ్రాప్ అవడం జరుగుతుంది. చివరికి ఏవి నిలబడుతాయో చూడాలంటే డిసెంబర్ రావాలి.

 

More

Related Stories