సంక్రాంతికి డైరెక్ట్ పోటీ తప్పింది

Sankranthi 2021

ఇప్పుడున్న 50 శాతం ఆక్యుపెన్సీ లిమిట్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మంచిది కాదు. దానికితోడు ఒకేరోజు రెండు సినిమాలు పోటీ పడడం అంటే ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఈ విషయాన్నీ తొందర్లోనే గ్రహించారు. 14న రామ్ సినిమాతో పోటీపడుతోంది అనుకున్న రవితేజ మూవీ ఇప్పుడు ముందుకొచ్చింది.

ఈ సినిమా 9వ తేదీన విడుదల కానుంది. అంటే… సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు సినిమాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది.

రవితేజ, శృతి జంటగా రూపొందిన “క్రాక్” జనవరి 9న, విజయ్ హీరోగా తెరకెక్కిన “మాస్టర్” 13న, రామ్ నటించిన రెడ్ 14న, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తీసిన “అల్లుడు అదుర్స్” జనవరి 15న విడుదల అవుతాయి. రవితేజ సినిమాకి, విజయ్ సినిమాకి మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఉంది. మిగతా మూడు సినిమాల మధ్య ఒక్కోరోజు ఎడం ఉంది.

అన్ని మాస్ చిత్రాలే కావడం విశేషం, విజయ్ డబ్బింగ్ మూవీ మాత్రం కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది అనిపిస్తోంది.

‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో రామ్ మంచి ఊపు మీదున్నాడు. ఈ సంక్రాంతికి హిట్ పడితే, అతని గ్రాఫ్ మరింత పెరుగుతుంది. రవితేజ “క్రాక్” ఆడడం కంపల్సరీ. ఇంతకుముందు నాలుగు ఫ్లాప్ చిత్రాలున్నాయి అతని ఖాతాలో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి కూడా ఒక సాలిడ్ హిట్ పడలేదు ఇంతవరకు అతనికి “అల్లుడు అదుర్స్” కీలకం.

More

Related Stories