
సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు, ఒకటి చిన్న సినిమా పోటీ పడడం సహజం. నాలుగు చిత్రాలు పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే, ఈ సారి అరడజను చిత్రాలు తమ డేట్స్ ని ప్రకటించాయి. ప్రస్తుతం అంతా గందరగోళం. ఇందులో ఎన్ని సినిమాలు నిజంగా సంక్రాంతికి వస్తాయో తెలీదు.
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” జనవరి 12న విడుదల కానుంది. ఇక రవితేజ హీరోగా రూపొందుతోన్న “ఈగిల్” జనవరి 13 డేట్ ని ఫిక్స్ చేసుకొంది. మరోవైపు, “హనుమాన్” అనే మరో చిత్రానిది ఇదే డేట్. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తీస్తున్న “ఫ్యామిలీ స్టార్” చిత్రం కూడా పండగ బరిలోనే ఉంది.
ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న “సైంధవ్” వచ్చి చేరింది. ఇది జనవరి 13, 2024న విడుదల కానుంది. ఇంకా షూటింగ్ సరిగా జరగని నాగార్జున చిత్రం “నా సామి రంగా” కూడా సంక్రాంతి ప్లాన్స్ ప్రకటించింది.
ఇవి కాకుండా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయి విడుదల కానున్న చిత్రాలు కూడ రెండు ఉన్నాయి. మొత్తంగా ఏడు చిత్రాలు ఇప్పటి వరకు డేట్స్ అనౌన్స్ చేశాయి.