సంక్రాంతికి ఈ మూడు కన్ ఫర్మ్

- Advertisement -
Guntur Kaaram

సంక్రాంతి పోటీలో చాలా సినిమాలు ఉంటాయి అని భావిస్తే చివరికి మూడు మాత్రమే పోటీపడేలా ఉన్నాయి. ఇంతకుముందు రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పోటీపడొచ్చు అనుకున్నారు. కానీ, అది వాయిదా పడింది. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ‘ప్రాజెక్ట్ కె’ మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. జనవరి 12, 2024 తమ సినిమా విడుదల తేదీ అని చెప్పారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా ఆ డేట్ కి రావడం కష్టం. తాజాగా, ‘హనుమాన్’ అనే చిత్రం జనవరి 12, 2024ని విడుదల తేదీగా ఫిక్స్ చేసుకొంది. ‘ప్రాజెక్ట్ కె’ సంక్రాంతి బరిలో ఉండడం లేదనే క్లారిటీ వచ్చాకే, ఈ ‘హనుమాన్’ టీం సంక్రాంతి డేట్ ప్రకటించింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ రెండున్నర నెలలు ఆగింది. ఐతే, ఇప్పుడు స్పీడ్ గానే చేసే ఆలోచనలో ఉన్నారు. నవంబర్, డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేస్తారు. సో, సంక్రాంతికి ఇది రావడం పక్కా.

రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘ఈగిల్’ షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమా మరో నెల రోజుల్లో పూర్తి అవుతుంది. సో, సంక్రాంతికి విడుదల అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం సంక్రాంతి 2024కి విడుదల అయ్యే చిత్రాలివే….

Sankranthi 2024
  1. హనుమాన్ – జనవరి 12, 2024
  2. ఈగిల్ – జనవరి 12, 2024
  3. గుంటూరు కారం – జనవరి 13, 2024

More

Related Stories