
ఫుల్ సీటింగ్ కెపాసిటీతో సినిమాలు ప్రదర్శించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో దేశమంతా అన్ని సినిమా థియేటర్లలో 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మేలా అనుమతి ఉంది. వారం రోజుల క్రితం తమిళ్ అగ్రహీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి 100 పెర్సెంట్ రన్ కి అనుమతి ఇవ్వాలని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశాడు.
వెంటనే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం జి.ఓ ఇష్యూ చేసింది. “మాస్టర్” సినిమా గతంలో లాగే హౌస్ ఫుల్ తో నడుస్తుంది. సోషల్ డిస్టెన్సిన్, సీట్ కి సీట్ మధ్య గ్యాప్ వంటి రూల్స్ అన్ని ఎగిరిపోయాయి. తమిళనాడులో కరోనా కంట్రోల్లోకి వచ్చిందట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అలాంటి అనుమతి దక్కుతుందా? సంక్రాంతి “అల్లుడు అదుర్స్”, “రెడ్”, “క్రాక్ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. ఐతే, మన దగ్గర అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ కేసుల తీవ్రత ఇంకా ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు అనుమతిస్తే… కోర్టులు కూడా ఊరుకోవు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు కరోనా విషయాల్లో విమర్శలు గుప్పిస్తోంది.