తెలుగులోకి ‘కాంతార’ భామ

Saptami Gowda

“కాంతర” ఇండియా మొత్తం ఆడింది. నిజమైన పాన్ ఇండియా సక్సెస్ ఆ మూవీదే. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడని హీరోయిన్ గా తీసుకోవాలని పలువురు తెలుగు దర్శకులు అనుకున్నారు. కానీ ఇప్పటివరకు కుదరలేదు.

మొత్తానికి ఆ కన్నడ కస్తూరి ఇప్పుడు తెలుగులో ఒక సినిమా సైన్ చేసింది అని టాక్. నితిన్ హీరోగా ఇటీవలే ‘తమ్ముడు’ అనే చిత్రం లాంఛనంగా ప్రారంభం అయింది. ఇందులో ఈ భామ ఒక హీరోయిన్ గా నటించనుంది.

అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ఆమెని తీసుకున్నారు అని అంటున్నారు. మెయిన్ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదంట.

నితిన్ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాడు. కానీ “తమ్ముడు” సినిమా పవన్ కళ్యాణ్ చిత్రం టైటిల్ కావడంతో ఆసక్తి ఏర్పడింది. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ తీస్తున్న ఈ సినిమాలో సిస్టర్ పాత్ర కీలకం. మరి నితిన్ కి అక్క పాత్ర ఎవరు పోషిస్తారు అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories