సారంగ దరియా: వివాదాన్ని ముగించిన కోమలి

Saranga Dariya song controversy

‘సారంగ దరియా’ పాట వివాదం ముగిసింది. వివాదం మొదలుపెట్టిన జానపద గాయని బుధవారం దర్శకుడు శేఖర్ కమ్ములని కలిశారు. ‘సారంగ దరియా’ పాటను “లవ్ స్టోరీ” సినిమాలో ఉపయోగించుకునే విషయంలో ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని ఆమె తెలిపారు.

‘సారంగ దరియా’ అనేది తెలంగాణ జానపద గీతం. ఐతే, ఇది ఎప్పుడో మరుగున పడింది. ఆ పాట సేకరణ చేసి దానికిమొదట ప్రాచుర్యం కల్పించారు జానపద గాయని కోమలి. ‘రేలా రేలా’ అనే మాటీవీ ప్రోగ్రాంలో కొన్నేళ్ల క్రితం ఆ పాటని విన్న శేఖర్ కమ్ముల… ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఉపయోగించుకున్నారు. హీరోయిన్ సాయి పల్లవిపై చిత్రీకరించిన ఆ సాంగ్ వైరల్ అయింది. ఈ పాటని మంగ్లీ పాడింది.

దాంతో, కోమలి అభ్యంతరం తెలిపారు. తనకి క్రెడిట్ ఇవ్వకుండా…. తన అనుమతి లేకుండా ఎలా ఉపయోగిస్తారని ఈ పేద కళాకారిణి ప్రశ్నించారు. దాంతో టీవీల్లో చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కమ్ములకి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి. దాంతో, స్పందించిన శేఖర్ కమ్ముల ఆమెకి న్యాయం చేస్తానని ఫేస్ బుక్ ద్వారా గతవారం ప్రకటించాడు. బుధవారం ఆమెని హైద్రాబాద్ లో కలుసుకొని, ఆమెకి ఆర్థికంగా సహాయం అందించాడు కమ్ముల.

“నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. అదే ఆరాటాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేశాను. ఈ రోజు దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. సంతోషంగా ఉంది. ఆయన తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే ‘లవ్ స్టోరి’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద ‘సారంగ దరియా’ పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు”, అని ఆమె మీడియాతో తెలిపారు.

Advertisement
 

More

Related Stories