
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ ఏఐజీ ఆస్ప త్రి తాజా ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా సెప్సిస్ వ్యాధితో బాధపడుతున్నారు శరత్ బాబు. పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఇటీవల హైదరాబాద్ ఏఐజీ ఆస్ప త్రిలో చేర్పించారు.
రెండురోజులుగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. నిన్న (ఏప్రిల్ 3) చనిపోయినట్లు పుకార్లు పుట్టాయి. ఈ రోజు (గురువారం ఏప్రిల్ 4) కూడా ఆయన పరిస్థితి క్లిష్టంగానే ఉంది అని ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ లో ఉంది.
శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉం ది. ఆయన వైటల్స్ స్థిరంగానే ఉన్నాయి. ఆయనకి మంచి చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు మీడియాకి వివరాలు అందచేస్తాం. ఆసుపత్రి ప్రతినిధులు, శరత్ బాబు కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఏమి చెప్పినా నమ్మొద్దు. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయొద్దు.” ఇది ఆసుపత్రి బులెటిన్ సారాంశం.
71 ఏళ్ల శరత్ బాబు శరీరం విషపూరితం అయింది. అందువల్ల అనేక భాగాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నా ఆయన్ని కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు.