చికెన్ అందుకే తినను: శరత్ బాబు

Sarath Babu


సీనియర్ నటుడు శరత్ బాబుకిప్పుడు 71 ఏళ్ళు. మంచి ఫిట్నెస్ తో ఉండే సీనియర్ నటుల్లో ఆయన ఒకరు. ఆయన ఆరోగ్య రహస్యాలు, ఫిట్నెస్ మంత్ర ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

“నేను రైస్ తినడం మానేసి చాలా ఏళ్ళు అయింది. అలాగే, చికెన్ తినడం మానేశా,” అని వివరించారు.

చికెన్ ప్రోటీన్ ఫుడ్. ఫిట్నెస్ కోసం చాలామంది చికెన్ తినడం చూస్తుంటాం. డాక్టర్లు కూడా చికెన్ తినొచ్చు అంటారు. మరి శరత్ బాబు ఎందుకు మానేశారు? “నేను ఎక్కడో ఒకసారి చదివాను. మనం నోటి చాపల్యం కోసం మరో ప్రాణిని చంపే హక్కులేదు అని. అది నిజం అనిపించింది. అలాగే మొక్కలకు ప్రాణం ఉండొచ్చు కానీ వాటికి నెర్వస్ సిస్టం లేదు. సో వాటికి నొప్పి తెలియదు. అలాగే ఒక కొమ్మ విరిస్తే పది కొమ్మలు పుడతాయి. ఈ సత్యం తెలుసుకున్నాక చికెన్ తినడం మానేశాను,” అని చెప్పారు.

రైస్, నాన్ వెజ్ మానేసి ఫిట్ గా ఉంటున్నారట.

 

More

Related Stories