Bigg Boss 5 హౌస్ లో సరయు క్లినిక్!


సరయు అనే ఒక నటి ఉంది. ఆమె యూట్యూబ్ లో చాలా పాపులర్ అని అంటున్నారు. శృంగార చిత్రాలు చూసే వారికి ఆమె బాగా పరిచయం అని టాక్ ఉంది. యూట్యూబ్ లో ఆమె సెక్స్ క్లినిక్ అనే వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటుందట. మాంఛి బూతులు, ఓపెన్ గా అన్ని విషయాలు మాట్లాడటం ఆమె స్టయిల్. దాంతో ఆమె వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

ఆమెకున్న పాపులారిటీ చూసి “బిగ్ బాస్” టీం ఈ సారి హౌస్ లోకి తీసుకొస్తోందట. ‘బిగ్ బాస్ సీజన్ 5’లోకి ఆమె కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. మరి, సరయు బిగ్ బాస్ హౌస్ లో కూడా సెక్స్ క్లినిక్ పెడుతుందా? అనేది చూడాలి.

సరయు ఎంట్రీతో ఈసారి మసాలా డోస్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఐతే, ఆమె నిజంగా “బిగ్ బాస్ 5″లోకి అడుగుపెడుతుందా లేక అది ఊహాగానమేనా అనేది ఈ ఆదివారంతో తేలిపోతుంది. నాగార్జున హోస్ట్ చేసే ‘బిగ్ బాస్ 5’ ఈ ఆదివారం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.

Advertisement
 

More

Related Stories