ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు: సరయు


“బిగ్ బాస్ సీజన్ 5” నుంచి బయటికి వచ్చిన సరయు కొత్త ఆరోపణలు చేస్తోంది. మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ అభిమానులమని చెప్పుకుంటున్న వారు కొందరు తనకు ఫోను చేసి బూతులు తిడుతున్నారని చెప్తోంది.

“షణ్ముఖ్‏… మూలన కూర్చో అని అన్నందుకు ఆయన అభిమానులు నన్ను టార్గెట్ చేశారు. కానీ లోపల ఏమి జరిగిందో వారికి తెలియదు,” అంటూ వివరించింది.

యూట్యూబ్ లలో నటిస్తూ పాపులర్ అయింది సరయు. మంచి మసాలాతో కూడిన వీడియోల్లో నటిస్తుంటుంది. ఆమె ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది అనుకున్నారు. ఆమె గ్లామర్ షో ఈ సీజన్ కి అట్రాక్షన్ అవుతుందని భావించారు. ఐతే, మొదటి వారంలోనే బయటికి రావాల్సి రావడంతో ఆమె బిగ్ డిజాప్పొయింట్ అయినట్లుంది.

అందుకే, సరయు ఇలాంటి ఘాటు కామెంట్స్ చేస్తోంది. షణ్ముఖ్ గాజులు తొడుక్కున్న ఆడంగి అని ఇంతకుముందు తిట్టింది.

 

More

Related Stories