మళ్ళీ సత్తా చాటిన మహేష్ బాబు

మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా జెమినీ టీవీకి బంగారు బాతులా దొరికింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో భాగంగా ఈ సినిమా ఇప్పటికే రికార్డ్ సృష్టించగా.. రిపీట్స్ లో కూడా మహేష్ మూవీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇటు బుల్లితెర వీక్షకుల్ని ఎంటర్ టైన్ మెంట్ చేస్తూనే, సదరు ఛానెల్ ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయడం లేదు.

ఈ వారం (అక్టోబర్ 10-16) టెలికాస్ట్ అయిన సినిమాల్లో “సరిలేరు నీకెవ్వరు” సినిమా మరోసారి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రిపీట్ లో కూడా కళ్లుచెదిరే టీఆర్పీ సాధించింది. 11వే తేదీ సాయంత్రం ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తే ఏకంగా12.55 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ రావడం విశేషం.

మూడో ఎయిరింగ్ లో కూడా ఈ రేటింగ్ రావడం రికార్డ్. బాహుబలి-2 తర్వాత రిపీట్స్ లో కూడా ఈ స్థాయిలో రేటింగ్ తెచ్చుకున్న సినిమా ఇదే.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కింద ఫస్ట్ టైమ్ ఈ సినిమాను టెలికాస్ట్ చేసినప్పుడు ఏకంగా 23.4 (అర్బన్+రూరల్) రేటింగ్ వచ్చింది. ఇక రెండోసారి టెలికాస్ట్ లో 14.81 (అర్బన్+రూరల్) టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా రేటింగ్స్ లో డబుల్ డిజిట్ సాధించింది ఈ సినిమా.

ఇక ఈ వారం టాప్-5లో రెండో స్థానంలో చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ (4.41 – అర్బన్) నిలవడం విశేషం. మూడో స్థానంలో ‘వినయ విధేయ రామ’ (4.37-అర్బన్), నాలుగో స్థానంలో ‘బందోబస్త్’ (4.13-అర్బన్), ఐదో స్థానంలో ‘రంగస్థలం’ (4.05-అర్బన్) నిలిచాయి.

 

More

Related Stories