
మహేష్ నుంచి ఓ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. రేపే అది థియేటర్లలోకి వస్తోంది. కాకపోతే ఇక్కడ కాదు, తమిళనాట. అవును.. తమిళనాడులో రేపు మహేష్ నటించిన ”సరిలేరు నీకెవ్వరు” తమిళ వెర్షన్ భారీ ఎత్తున విడుదలకాబోతోంది. తమిళంలో దీనికి ”ఇవనక్కు సరియానఅళ్లాయ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈనెల 10 నుంచి తమిళనాట థియేటర్లు తెరుచుకున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాహాళ్లు తెరుచుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటివరకు దాదాపు 60శాతం థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే ప్రదర్శించడానికి బడా తమిళ తమిళ సినిమాల్లేవు. దీంతో మహేష్ మూవీకి కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మల్టీప్లెక్సులు ఓపెన్ చేసినప్పుడు.. ”సరిలేరు నీకెవ్వరు” సినిమానే ప్రదర్శించారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయిన టైమ్ లో కూడా సరిలేరు నీకెవ్వరు సినిమానే (తమిళ వెర్షన్) రిలీజ్ కు రెడీ అవ్వడం విశేషం.