30 రోజులు దుబాయిలోనే

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ ఈ రోజు దుబాయ్ లో మొదలైంది. అమెరికాలో తీద్దామనుకున్న సీన్లన్నీ దుబాయిలోనే తీస్తున్నారు. కోవిడ్ కారణంగా అమెరికాలో షూటింగ్ కి అనుమతులు, వీసా దక్కడం సమస్యగా మారింది. దాంతో ఈ మూవీ షూటింగ్ దుబాయ్ కి మార్చింది టీం. 30 రోజుల పాటు అక్కడే షూటింగ్.

మొదటి షెడ్యూలు దుబాయ్ లో పూర్తి చేసుకొని మిగతా భాగం షూటింగ్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో తీస్తారు.

‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన దర్శకుడు పరశురాంకి ఈ సినిమా డ్రీం ప్రాజెక్ట్. మహేష్ బాబుని డైరెక్ట్ చెయ్యాలనేది ఆయన కల. కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటోంది. ఆమెకి కూడా మహేష్ బాబు సరసన నటించడం ఇదే ఫస్ట్. ఆమె కూడా మహేష్ కి అభిమాని.

More

Related Stories