సర్కారువారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట నిన్నటితో 7 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఈ వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు 79 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 107 కోట్ల రూపాయలకు పైగా నెట్ వచ్చినట్టు తెలిపారు.

సర్కారువారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే.. ఈ వారాంతానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి…


నైజాం – 29.90 కోట్లు
సీడెడ్ – 9.95 కోట్లు
ఉత్తరాంధ్ర – 10.71 కోట్లు
ఈస్ట్ – 7.40 కోట్లు
వెస్ట్ – 4.75 కోట్లు
గుంటూరు – 7.99 కోట్లు
నెల్లూరు – 3.07 కోట్లు
కృష్ణా – 5.13 కోట్లు

 

More

Related Stories