
మహేష్ బాబు – కీర్తి సురేష్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ని బట్టి చూస్తే ‘సర్కారు వారి పాట’లో వీరి మధ్య రొమాంటిక్ సీన్లు బాగా కుదిరినట్లు ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ రొమాంటిక్ సీన్లు సూపర్ గా తీస్తాడు. డైలాగ్ లు బాగా రాస్తాడు. “గీత గోవిందం” సినిమాలో చూశాం కదా!
‘గీతగోవిందం’ తర్వాత పరశురామ్ తీస్తున్న సినిమా ఇదే. ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు లోన్లు వసూళ్లు చేసే కంపెనిని నడిపే వ్యక్తిగా కనిపిస్తాడట. ఆ కంపెనీలో పనిచేసే తెలుగు అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు కళావతి.
వీరి మధ్య ఆఫీస్ రొమాన్స్ సినిమాకి హైలెట్ అని ఒక టాక్ నడుస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంత అనేది సినిమా విడుదల తర్వాతే చెప్పగలం.
కీర్తి సురేష్ తెలుగులో పెద్ద హీరోల సరసన చేసిన చిత్రాలు తక్కువ. గతంలో పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించింది. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆమెకి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి ఇతర పెద్ద హీరోల సరసన కూడా సినిమాలు వస్తాయేమో చూడాలి.
ALSO READ: Sarkaru Vaari Paata blaster: Mahesh Babu’s new style
‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.