
కరోనా కల్లోలం మామూలుగా లేదు. ‘సర్కారు వారి పాట’ సినిమా టీంకి కూడా కరోనా షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా టీంమెంబర్స్ లో ఆరుగురికి కరోనా సోకింది. దాంతో, షూటింగ్ నిలిపివేశారు. టీం అందరూ కొన్నాళ్ళూ ఐసోలేషన్ కి వెళ్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసి జులై నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారట. ఐతే, ఈ కరోనా కేసులు షూటింగ్ షెడ్యూల్స్ ని తారుమారు చేస్తున్నాయి.
‘సర్కారు వారి పాట’ షూటింగ్ అనుకున్న డేట్ కి పూర్తి అవుతుందా అన్నదే డౌట్. ఇంతకుముందు… ముంబైలో కేసులు ఎక్కువగా ఉంటే హైదరాబాద్ కి వచ్చి షూటింగ్ జరిపేవారు. కానీ ఇప్పుడు దేశంలోని అన్నీ నగరాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్ లో గతేడాది కన్నా ఈ సారి కేసులు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల కన్నా తీవ్రత ఎక్కువగా ఉంది.
సినిమా నిర్మాతలకు విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశం కూడా లేదు. విదేశాల్లో కూడా కరోనా ఎక్కువగానే ఉంది. పైగా.. ఫ్లైట్ ట్రావెలింగ్ లోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. సో… ‘సర్కారు వారి పాట’ అనుకున్న డేట్ కి పూర్తి కావడం కొంత డౌటే.