కోలుకుంటున్నాను: శశి ప్రీతమ్

Music director Sasipreetam

తన ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు శశి ప్రీతమ్. హాస్పిటల్ లో జాయిన్ అయిన ఇతడిపై 2 రోజులుగా రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు వాటన్నింటిపై క్లారిటీ ఇచ్చాడు శశిప్రీతమ్.

“ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హార్ట్ లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా థాంక్స్”

ఇలా తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత ఇచ్చాడు శశిప్రీతమ్. గులాబీ, సముద్రం లాంటి సినిమాలకు సంగీతం అందించాడు శశిప్రీతమ్. టాలీవుడ్, బాలీవుడ్ లో వర్క్ చేశాడు. తమన్, అనూప్ రూబెన్స్ లాంటి సంగీత దర్శకులు శశిప్రీతమ్ వద్ద వర్క్ చేశారు.

Related Stories