
ఒకప్పుడు శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతలకు భారీ ఆదాయం సమకూరేది. శాటిలైట్ ఛానెల్స్ కి కూడా యాడ్స్ రూపంలో భారీ మొత్తం వచ్చేది. అప్పట్లో చిన్నాపెద్దా అని తేడా లేకుండా అన్ని సినిమాలను తెగ కొనేవారు. ఐతే, ఇప్పుడు కాలం మారింది. ఓటిటీల యుగం ఇది. ఓటిటి హక్కుల ద్వారా భారీ మొత్తం వస్తోంది నిర్మాతలకు. ఇక శాటిలైట్ ఛానెల్స్ సెలెక్టీవ్ గా కొంటున్నాయి
అందుకే, అనేక సినిమాల శాటిలైట్ డీల్స్ కుదరక ఆగిపోయాయి.
రానా నటించిన ‘విరాటపర్వం’ గతేడాది థియేటర్లలో విడుదలయింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఏ ఛానెల్ తీసుకోలేదు.
ఇక ఇటీవల విడుదలైనా ‘శాకుంతలం’, ‘దసరా’, ‘రామబాణం’ సినిమాలను కూడా ఏ ఛానెల్ కొనలేదు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాల ఓటిటి హక్కులు మాత్రం భారీ మొత్తానికి వెళ్లాయి. కానీ, హిట్టయిన ‘దసరా’ సినిమాని కూడా ఏ ఛానెల్ తీసుకోలేదు. తన పారితోషికంలో భాగంగా శాటిలైట్ హక్కుల్ని ఉంచుకున్న నానికి ఇది పెద్ద లాస్.