
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
‘‘వెపన్’ లాంటి ఓ సినిమాను తీయాలంటే నటీనటులకంటే ముందుగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్ వాళ్లే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్ కు ప్రాధాన్యత అని నా అభిప్రాయం. వెపన్ సినిమా విషయానికి వస్తే చాలా మంచి టీమ్ కుదిరింది డిఫరెంట్ కాన్సెప్ మూవీ. నిర్మాతలైతే మరో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టి సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. డైరెక్టర్ గుహన్ అయితే సరికొత్త విజన్ తో సినిమాను ఆవిష్కరించారు,” అన్నారు సత్యరాజ్.
“మా బ్యానర్ లో వస్తోన్న తొలి సినిమా. సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు నిర్మాత మన్సూర్.