గుమ్మడికాయ కొట్టిన ‘కథాకేళి’

- Advertisement -

దర్శకుడు సతీశ్ వేగేశ్న గురించి పరిచయం అక్కర్లేదు. “శతమానం భవతి” చిత్రంతో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. జాతీయ అవార్డు కూడా దక్కింది ఆ చిత్రానికి.

మంచి చిత్రాలు తీసే సతీష్ వేగేశ్న తాజాగా ‘కథాకేళి’ అనే చిత్రం తీస్తున్నారు. ఆయన కొడుకు యశ్విన్‌ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు.

చింతా గోపాలకృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక మూవీ షూటింగ్‌ కి గుమ్మడికాయ కొట్టారు. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రానికి ఎస్‌.కె.బాల‌చంద్ర‌న్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ ప్రకటిస్తారట.

 

More

Related Stories