మరో అచ్చతెలుగు టైటిల్!

“శతమానంభవతి”, “శ్రీనివాసకల్యాణం”, “ఎంత మంచివాడవురా”.. ఇలా అచ్చతెలుగు టైటిళ్లు పెట్టడంలో స్పెషలిస్ట్ దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇప్పుడీ డైరక్టర్ మరో మంచి తెలుగు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన కొత్త సినిమాకు “కోతి కొమ్మచ్చి” అనే టైటిల్ ఖరారు చేశాడు.

సతీష్ వేగేశ్న కొడుకు సమీర్ ఈ “కోతికొమ్మచ్చి”తో హీరోగా పరిచయం అవుతున్నాడు. మరో హీరోగా శ్రీహరి తనయుడు మేఘాంష్ నటిస్తున్నాడు. వీళ్లిద్దర్నీ పెట్టి ఓ రొమాంటిక్ కామెడీ డ్రామాను కోతికొమ్మచ్చిగా చూపించబోతున్నాడు సతీష్.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్ ఎల్ వి సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. తన కెరీర్ లో దర్శకుడిగా సతీష్ వేగేశ్న ట్రై చేస్తున్న ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ ఇదే.

Related Stories