రిలీజ్ కు 2 సినిమాలు.. సెట్స్ పై మరో సినిమా

సత్యదేవ్ నుంచి 2 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో గాడ్సే సినిమా విడుదల తేదీని ఆల్రెడీ ఓసారి  ప్రకటించి వాయిదా వేశారు. ఇది రిలీజైన వెంటనే మినిమం గ్యాప్ లో గుర్తుందా శీతాకాలం అనే సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఓవైపు ఇలా 2 సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేసిన సత్యదేవ్, ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

ఈరోజు ఫుల్ బాటిల్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో చిన్నపాటి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాను స్టార్ట్ చేశారు. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకుడు. ఇంతకుముందు శరణ్-సత్యదేవ్ కాంబినేషన్ లో తిమ్మరుసు సినిమా వచ్చింది. అది సీరియస్ మూవీ. ఫుల్ బాటిల్ మాత్రం పూర్తిస్థాయిలో కామెడీ ఎంటర్ టైనర్.

ఎస్ డీ కంపెనీతో కలిసి రామాంజనేయులు జవ్వాది ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఫరియా అబ్దుల్లాను అనుకుంటున్నారు.

 

More

Related Stories