పెంగ్విన్ దర్శకుడితో సత్యదేవ్ చిత్రం

విభిన్న కథలు ఒప్పుకుంటూ, విలక్షణ పత్రాలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. ఇప్పటికే 25 చిత్రాలు పూర్తి చేశాడు . ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రకటించాడు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘పెంగ్విన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమానే.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రెడ్ థీమ్‌తో రూపొందించిన గుర్రం కనిపిస్తుంది. త్వరలోనే సినిమా లాంచ్ కానుంది. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు కనిపించనున్నారు.

బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

 

More

Related Stories