
సత్యదేవ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రెండో కరోనా వేవ్ ముగిసిన వెంటనే విడుదల కానున్న తొలి సినిమా కూడా సత్యదేవ్ దే కావడం విశేషం. ఆయన నటించిన ‘తిమ్మరుసు’ జులై 30న విడుదలకి టార్గెట్ చేసింది.
ఇక ఈ హీరో డైరెక్టర్ కావాలని అనుకుంటున్నాడు. కాకపొతే ఇప్పుడే కాదు. దానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఒక ఐదారేళ్ళ తర్వాత ఉంటుంది. కానీ ఇప్పటినుంచే తనకి వచ్చిన ఐడియాలన్నింటిని రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడట. తన స్క్రిప్ట్ తానే రాసుకుంటాడట.
సత్యదేవ్ గతేడాది కరోనా వేవ్ కారణంగా బాగా పాపులర్ అయ్యాడు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గువ్వా గోరింక, 47 డేస్, పిట్టకథలు వంటివి డైరెక్ట్ గా పలు ఓటిటి వేదికలపై విడుదలయ్యాయి. దాంతో సత్యదేవ్ చిన్న సినిమాలకు సూటయ్యే హీరోగా క్రేజ్ దక్కింది. ఇప్పుడు ఐదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.