లాక్డౌన్లో బిజీ అయిన ఏకైక హీరో!

లాక్ డౌన్ లోనే “47 డేస్” రిలీజైంది. లాక్ డౌన్ లోనే “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” విడుదలైంది. చివరికి లాక్ డౌన్ లోనే కొత్త సినిమా కూడా లాంఛ్ అయింది. ఇప్పుడు వీటికి అదనంగా మరిన్ని సినిమాలు లైన్లో పెట్టాడు సత్యదేవ్. అలాగే, ఈ గ్యాప్ లోనే సూర్యకి తన గొంతు అరువు ఇచ్చాడు. “ఆకాశమే నీ హద్దు రా” సినిమాలో సూర్యకి డబ్బింగ్ చెప్పాడు.

ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం” అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఓ కన్నడ రీమేక్. నవంబర్ నుంచి ఇది సెట్స్ పైకి రాబోతోంది. దీంతో పాటు “తిమ్మరుసు” అనే మరో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. ఇది కూడా ఓ కన్నడ రీమేక్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా అక్టోబర్ 20 నుంచి సెట్స్ పైకి రాబోతోంది.

ఈ రెండు సినిమాలతో పాటు మరో 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సత్యదేవ్. ఈ సినిమాల ఎనౌన్స్ మెంట్స్ కూడా మరో 2 నెలల్లో రాబోతున్నాయి. ఇలా లాక్ డౌన్ లో కూడా వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు సత్యదేవ్.

Related Stories