సాయికుమార్…శివాజీ…. సత్యదేవ్

Satyadev

సాయికుమార్, శివాజీ లాంటి వాళ్లు కేవలం నటులు మాత్రమే కాదు, మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా. రాజశేఖర్ నటించిన ఎన్నో సినిమాలకు సాయికుమార్ డబ్బింగ్ ప్లస్ అయింది. అటు శివాజీ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా పేరు తెచ్చుకున్నాడు. నితిన్ కు కెరీర్ స్టార్టింగ్ లో డబ్బింగ్ చెప్పింది శివాజీనే. నితిన్ తో పాటు మరికొంతమంది నటులకు కూడా డబ్బింగ్ చెప్పాడు.

ఇప్పుడీ లిస్ట్ లోకి సత్యదేవ్ కూడా చేరిపోయాడు.

ఫస్ట్ టైమ్ హీరో సూర్యకు డబ్బింగ్ చెప్పాడు సత్యదేవ్. “ఆకాశం నీ హద్దురా” సినిమాలో వినిపించిన సూర్య వాయిస్ ఇతడిదే. సినిమాకు అది ప్లస్ అయింది. అంతేకాదు, సినిమా బాగుందనిపించుకోవడంతో సత్యదేవ్ కి కూడా ప్లస్ అయింది. ఇకపై సూర్య సినిమాలకు ఇతడే వరుసగా డబ్బింగ్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సత్యదేవ్ ది బేస్ వాయిస్. అతడి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ బాగుంటుంది. ఇన్నాళ్లూ తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ఈ నటుడు, ఇప్పుడు సూర్య మూవీతో కొత్త తలుపులు తెరిచాడు. ఇకపై సాయికుమార్, శివాజీ తరహాలో సత్యదేవ్ కూడా పాపులర్ అవుతాడేమో.

“మిస్టర్ పర్ఫెక్ట్” సినిమాలో చిన్న పాత్రతో అడుగుతుపెట్టిన సత్యదేవ్ “బ్రోచేవారెవురురా”, “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” సినిమాలతో హీరోగా స్థిరపడ్డాడు. ఇప్పుడు చేతిలో హీరోగా మూడు, నాలుగు చిత్రాలున్నాయి.

Related Stories