యాక్షన్ డోస్ తో తిమ్మరుసు

- Advertisement -

వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న సత్యదేవ్‌..మరోసారి డిఫరెంట్‌గా లాయర్‌ పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ‘తిమ్మరుసు’ సినిమా అతని కొత్త చిత్రం. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్ తో రూపొందుతోన్న ఈ మూవీలో కొంచెం యాక్షన్ డోస్ పెంచాడు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

“సత్యదేవ్‌ ఒక డేరింగ్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమా దాదాపు పూర్తయ్యింది. వచ్చే నెల సినిమాను ప్రేక్షకులను ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నాం” అన్నారు నిర్మాతలు.

Thimmarusu Telugu Movie Teaser | Satyadev | Priyanka Jawalkar | Sharan Koppisetty | Telugu FilmNagar

సత్యదేవ్ మంచి ఊపు మీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

 

More

Related Stories