సావిత్రి w/o సత్యమూర్తి పూర్తి

- Advertisement -
Savitri

60 ఏళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇది ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’లో మెయిన్ పాయింట్. 25 ఏళ్ల వాడిగా పార్వతీశం (‘కేరింత’ ఫేమ్) నటిస్తున్నాడు. 60 ఏళ్ల అతని భార్యగా హాస్యనటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు.

పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ అంటున్నారు.

“కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం,” అని అన్నారు నిర్మాత గోగుల నరేంద్ర.

More

Related Stories