పుకార్లకు చెక్ పెట్టింది

Sayyesha

ఆమధ్య సాయేషా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అందులో ఆమె కాస్త లావుగా కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వీడియో పెట్టింది. అందులో ఆమె లూజ్ గా ఉండే సల్వార్ డ్రెస్ వేసుకుంది. ఆమె నడక కూడా చాలా నెమ్మదిగా ఉంది. ఈ రెండు వీడియోల ఆధారంగా సాయేషా ప్రెగ్మెంట్ అయిందంటూ కోలీవుడ్ మీడియా కథనాలు వండివార్చేసింది.

ఇలా తనపై వచ్చిన పుకార్లకు వెరైటీగా చెక్ పెట్టింది సాయేషా. ఓ డాన్స్ వీడియో రిలీజ్ చేసి తను గర్భవతి కాదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. సాయేషాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా డాన్స్ చేయడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందుకే ప్రెగ్నెన్సీ రూమర్లకు కూడా ఆ డాన్స్ తోనే సమాధానం చెప్పింది.

ఎప్పట్లానే మరోసారి డాన్స్ ఇరగదీసింది సాయేషా. చాలా ఫిట్ గా కూడా కనిపించింది. సో.. సాయేషా-ఆర్య నుంచి గుడ్ న్యూస్ వినాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. గతేడాది మార్చిలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Related Stories