సరైన హీరోయిన్ కావాలి

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న “ఆచార్య” సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఆమె త్వరలోనే జాయిన్ అవుతుంది. ఆ తర్వాత ‘వేదాళం” సినిమా రీమేక్ ని మొదలు పెడుతారు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రకి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే. ఐతే, ఇంకా సైన్ చెయ్యలేదు. మరి చిరంజీవి సరసన నటించిదెవ్వరు?

తమిళ సినిమా “వేదాళం”లో అజిత్ సరసన శృతి హాసన్ నటించింది. ఇప్పుడు ఈ రీమేక్ లో మెగాస్టార్ సరసన నటించే భామ కోసం వెతుకులాట షురూ. సీనియర్ హీరోలకు సరైన హీరోయిన్లని వెతకడం ఒక పెద్ద ఇష్యుగా మారింది. మరి చిన్నపిల్లలా కనిపించే వారిని తీసుకోలేరు. అలాగని ఫేడ్ అవుట్ వారు కూడా వద్దు. అందుకే… చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ కి హీరోయిన్లని ఫిక్స్ చెయ్యడం ఒక పెద్ద టాస్క్.

వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలు పెడుతారు. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు. అనిల్ సుంకరకి చెందిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.

Related Stories