
ఇటీవల ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం మరోసారి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేశాడు . ‘సెబాస్టియన్ పిసి 524’ పేరుతో ఈ కొత్త థ్రిల్లర్ రూపొందింది. ఈ సినిమా ఒక థ్రిల్లర్. కిరణ్ అబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు.
మార్చి 4న విడుదల కానుంది ఈ మూవీ.
కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈ రోజు సినిమాలో ‘సెబా…’ సాంగ్ విడుదల చేశారు.
కంటిలోన చీకటిని, గుండెలోన దాచుకుని…
వేదనలో వేడుకలా వెలుగు సెబా…
రాజాధి రాజా!
వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని…
ఏలుకొనే ఏలికలా ఎదురు సెబా…
రాజాధి రాజా!
జిబ్రాన్ సంగీతం అందించారు. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం.