హైదరాబాద్ కి సీరత్ షిప్ట్!

తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో వివరించింది హీరోయిన్ సీరత్ కపూర్. తను ముంబయిలో ఉంటానని, షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి మళ్లీ ముంబయి వెళ్లిపోతుంటానని చెబుతోంది. ఇలా చేయడం వల్ల టాలీవుడ్ సర్కిల్ కు తను దూరమయ్యానని, తెలుగు కల్చర్ ను అర్థం చేసుకోలేకపోయానని చెబుతోంది.

గడిచిన 3 నెలలుగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లోనే ఉంటోంది. సిటీ తనకు చాలా బాగా నచ్చిందని, ఇకపై మేకర్స్ కు అందుబాటులో ఉంటూ మరిన్ని సినిమాలు చేస్తానని చెబుతోంది. ఇటీవల ఆమె నటించిన “కృష్ణ అండ్ హిజ్ లీల”, “మా వింత గాథ వినుమా” ఒటిటిలో విడుదల అయ్యాయి.

”రన్ రాజా రన్” సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ రాలేదనే విషయాన్ని ఒప్పుకున్న సీరత్ కపూర్.. గతంలో ముంబయిలో ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేజారాయని, ఈసారి అలాంటి ఛాన్స్ తీసుకోనని అంటోంది.

మొత్తమ్మీద మరో హీరోయిన్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. నిజానికి ఈ పని గతంలోనే చేసి ఉంటే, ఈపాటికి సీరత్ కపూర్ లైఫ్ సెట్ అయిపోయి ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తానంటూ ఓపెన్ అఫర్ ఇస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ.

Related Stories