రాజశేఖర్ చూపు అటువైపే

Rajashekar


రాజశేఖర్ సీనియర్ హీరో. కొంత గ్యాప్ తర్వాత ఆయన ఒక సినిమాలో నటించారు. ‘శేఖర్’ అనే పేరుతో రూపొందింది ఆయన తాజా చిత్రం. మలయాళంలో సూపర్ హిట్టైన ‘జోసెఫ్’ అనే సినిమాకి ఇది రీమేక్. మంచి థ్రిల్లర్.

దాంతో, రాజశేఖర్ సినిమా హక్కులు కొనేందుకు ఓటిటి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మొన్నటివరకు థియేటర్లలో విడుదల చేద్దామని భావించిన రాజశేఖర్ కుటుంబం ఇప్పుడు ఓటిటి డీల్ వైపే మొగ్గు చూపుతున్నారట. ఎందుకంటే… ఈ సినిమాకి దర్శకురాలు జీవిత. నిర్మాతలు వారి పిల్లలే. అంటే మొత్తంగా సొంత సినిమా!

థియేటర్లలో విడుదల చేసి… లాభం వస్తుందో రాదో అని టెన్షన్ పడకుండా ఓటిటికిచ్ఛేస్తే మంచి లాభం ఉంటుంది. ఎలాంటి ఆందోళన ఉండదు కదా అని అనుకుంటున్నారట.

ఇటీవల రాజశేఖర్ పెద్ద కూతురు శివాని నటించిన ‘అద్భుతం’ అనే సినిమాకి ఆ సినిమా నిర్మాతలు మంచి డీల్ కుదుర్చుకొని లాభాలు చేసుకున్నారు. ఆ నిర్మాతలు ఇచ్చిన సలహాతో ఇప్పుడు ఈ ‘శేఖర్’ సినిమాని కూడా డిస్నీ హాట్ స్టార్ కే ఇవ్వాలనుకుంటున్నారట.

Advertisement
 

More

Related Stories