నా జడ్జిమెంట్ పర్ఫెక్ట్: కమ్ముల

Sekhar Kammula

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు మనసుకు హత్తుకుంటాయి. సింపుల్ స్టోరీస్ ని ఆకట్టుకునేలా చెప్పడంలో ఆయన శైలి విభిన్నం. ‘ఆనంద్’, ‘హ్యాపీ డేస్’, ‘ఫిదా’ ఇలా చాలా బ్లాక్ బస్టర్లు ఉన్నాయి ఆయన ఖాతాలో. ఇన్నేళ్ల తర్వాత కూడా తనకి హీరోలకు కథలని సరిగా నేరేట్ చెయ్యడం రాదు అని అంటున్నారు శేఖర్ కమ్ముల.

అది వచ్చి ఉంటే… మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి బడా స్టార్స్ తో మూవీస్ చేసేవాడినని చెప్తున్నారు.

“ఫిదా సినిమాని మొదట మహేష్ బాబుకి చెప్పాను. కానీ కథ సరిగా నేరేట్ చెయ్యలేకపోయాను. అందుకే, మహేష్ నుంచి ఓకే అని రాలేదు,” అని శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన తీసిన లేటెస్ట్ మూవీ.. “లవ్ స్టోరీ”. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు.

ఏ సినిమా ఆడుతుంది, ఏది ఆడదు అనే విషయంలో మాత్రం తనకి ఫుల్ క్లారిటీ ఉంటుందని అంటున్నారు. తన జడ్జిమెంట్ తప్పు కాదంట. ‘లవ్ స్టోరీ’ కూడా హిట్ అని చెప్తున్నారు.

More

Related Stories