- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు ఆగిపోయాయి. మరో రెండు నెలల వరకు ఇంతే. దాంతో సినిమా కార్మికులకు కష్టాలు పెరిగాయి. వారిని ఆదుకుంటామని చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీ చెప్పింది. గత ఏడాది కరోనా క్రైసిస్ ఛారిటీ చాలా బాగా చేసింది. ఈ ఏడాది ఇంకా కార్యక్రమాలు మొదలుపెట్టలేదు.
దాంతో డ్యాన్సర్లను ఆదుకునేందుకు ప్రముఖ కొరెయాగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముందుకొచ్చారు. భోజనాలకు, నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడే డ్యాన్సర్లను తాను ఆదుకుంటాను అని అంటున్నారు శేఖర్ మాస్టర్. తనకు ఫోన్ చేస్తే తన టీం వారికి కావాల్సినవి అందచేస్తుందని చెప్తున్నారు.
Numbers
9989189885 (Asst. Baba),
9618961492 (Asst. Sekhar),
7416519257 (Asst. Vinod).