ఆమె అందాల షోకి నో ఆడియెన్స్

Mrunal

‘పఠాన్’ సినిమా రికార్డులు బద్దలుకొట్టింది. దాంతో, బాలీవుడ్ చిత్రసీమ కోలుకున్నట్లే అనుకున్నారు అంతా. కానీ, నిన్న శుక్రవారం విడుదలైన సినిమాతో బాలీవుడ్ కి మరోసారి షాక్ తగిలింది. ఆ సినిమా… ‘సెల్ఫీ’. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి, మృణాల్ ఠాకూర్ మెయిన్ రోల్స్ పోషించారు.

మొదటిరోజు ఈ సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు అక్షరాలా … 2 కోట్లు. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమాకి 2 కోట్ల ఓపెనింగ్ అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. గత నెలలో విడుదలైన షారుక్ సినిమా 57 కోట్లు కొల్లగొట్టింది. అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చిన మొత్తం కేవలం రెండు కోట్లు.

అక్షయ్ కుమార్ ఈ సినిమాకి చాలా హడావిడి చేశాడు. మృణాల్ ఠాకూర్ (‘సీతారామం’ ఫేమ్) ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేసింది పాటల్లో. ఆ పాటలను తెగ ప్రమోట్ చేశారు. అక్షయ్ కుమార్ ని చూసేందుకు జనం రాలేదు. మృణాల్ ఠాకూర్ అందాలు చూసేందుకు కూడా ఎవరూ కదలలేదు.

బాలీవుడ్ దర్శక, నిర్మాతలకు ఇంకా జనాలని ఆకట్టుకోవాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో తెలియడం లేదు. ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంది బాలీవుడ్ సీన్.

 

More

Related Stories