మళ్ళీ ప్రూవ్ చేసిన షారుక్, దీపిక

Pathaan


దీపిక పదుకోన్ ని హీరోయిన్ గా బాలీవుడ్ తెరకు పరిచయం చేసిందే షారుక్ ఖాన్. ఆయన నిర్మించిన సినిమాలో నటించి హీరోయిన్ గా ఎదిగింది దీపిక. ఇప్పుడు ఆమె గ్లోబల్ రేంజ్ లో పేరున్న టాప్ హీరోయిన్. దీపిక, షారుక్ కాంబినేషన్ ని హిట్ కాంబినేషన్ గా భావిస్తారు. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలు బ్లాక్బస్టర్ గా నిలిచాయి.

ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తోన్న ‘పఠాన్’ సినిమా అనేక వివాదాలు మూటకట్టుకొంది. ఈ సినిమాలో దీపిక వేసుకున్న బికినీ గురించి బీజేపీ నేతలు వివాదం సృష్టించారు. కాషాయం రంగు బికినీ విషయంలో గొడవ అయింది. ఐతే, షారుక్, నిర్మాత ఆదిత్య చోప్రా ఆ షాట్స్ ని తొలగించారు. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే వారమే థియేటర్లలో పఠాన్ సందడి.

తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. తొలిరోజు ‘బుక్ మై షో’ సర్వర్ క్రాష్ అయింది. షారుక్ అభిమానులు బుకింగ్ కోసం ఎగబడడంతో ఇలా జరిగింది. ఇక హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టిప్లెక్స్ లో కేవలం మూడు గంటల్లో 18వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమాకి మనదగ్గర కూడా యమా క్రేజ్ ఉంది అని అర్థమవుతోంది.

దాదాపు నాలుగేళ్లు అయింది షారుక్ సినిమా వచ్చి. వరుస అపజయాలతో షారుక్ గ్యాప్ తీసుకొని ఈ సినిమాలో నటించాడు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను థియేటర్లవైపు రప్పిస్తోంది.

ఇటీవల బాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు ఏవీ ఆడలేదు. ఇలాంటి కష్టకాలంలో షారుక్, దీపిక సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ ఇలా ఉందంటే గ్రేట్.

దీపిక బికినీ వివాదం కలిసొచ్చిందా!

ఒక పాటలో దీపిక పూర్తిగా బికినిలో అందచందాలు ప్రదర్శించడం, అలాగే అదే పాటలో ఆమె కాషాయ రంగు బికినీ ధరించడం, అది పెద్ద వివాదం కావడంతో సినిమాకి బాగా పబ్లిసిటీ వచ్చింది. నెగెటివ్ ప్రచారం కూడా సినిమాపై హైప్ ని తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ వివాదం సినిమాకే ప్లస్ అయింది.

 

More

Related Stories