‘105 మినిట్స్’ గ్లింప్స్ వీడియో

- Advertisement -
Hansika 105

హన్సిక మొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా “సింగిల్ షాట్”, “సింగిల్ క్యారెక్టర్” తో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’.

ఈ చిత్ర గ్లింప్స్ వీడియోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్ విడుదల చేశారు. రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బొమ్మక్ శివ నిర్మాత. సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.

“హాలీవుడ్ లో మాత్రమేఇలాంటిది చేశారు. మనవాళ్ళు ఎవరూ ఎందుకు ప్రయత్నించడం లేదు అని అనుకుంటున్నటైంలో ‘105 మినిట్స్’ చేసి చూపిస్తున్నారు రాజు దుస్సా. కథ, కథనం చాలాథ్రిల్లింగ్ గా అనిపించాయి. 105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఒక టెక్నీషియన్ గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి కొత్త తరం ఆలోచనతో కథలు తెరకెక్కిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది,” అని టీంని ప్రశంసించారు సెంథిల్.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

 

More

Related Stories