సెప్టెంబర్ లో ఇన్ని చిత్రాలా?


మొన్నటివరకు సెప్టెంబర్ క్యాలెండర్ ఖాళీగా కనిపించింది. కానీ, ఇప్పుడు చిన్న, మధ్యస్థాయి సినిమాలు హడావిడిగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. ఒక్కో వారం రెండు, మూడు సినిమాలు పోటీపడనున్నాయి. ఈ నెలలో ఒకేసారి ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ హిట్ అయ్యేసరికి అందరికీ ఉత్సాహం వచ్చినట్లు ఉంది.

సెప్టెంబర్ 2 తేదీన వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రంగ రంగ వైభవంగా’ విడుదల కానుంది. ఆ తర్వాత వారం కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ థియేటర్లలోకి వస్తుంది. అదే రోజు అంటే సెప్టెంబర్ 9న శర్వానంద్ తమిళ – తెలుగు చిత్రం ‘ఒకే ఒక జీవితం’, అలాగే ఎన్నో నెలలుగా ఆగిపోయిన సత్యదేవ్, తమన్నాల చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ రానున్నాయి. అంటే ఒకే వీకెండ్ మూడు చిత్రాల మధ్య పోటీ

ఇక సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తీసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రెజీనా, నివేథ థామస్ నటించిన ‘శాకిని డాకిని’ చిత్రాలు సెప్టెంబర్ 16న తమ డేట్స్ ని లాక్ చేసుకున్నాయి.

నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రిద విహారి’, అల్లూరి చిత్రాలు సెప్టెంబర్ 23న పోటీపడుతున్నాయి. ఆ నెలలో చివరి రోజున మణిరత్నం తీసిన పాన్ ఇండియా ‘పొన్నియన్ సెల్వన్ 1’ రానుంది. మొత్తమ్మద, సెప్టెంబర్ నెల ఫుల్లుగా సినిమాలే సినిమాలు.

 

More

Related Stories