
‘సెబాస్టియన్’ రిలీజైంది. ‘సమ్మతమే’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ అబ్బవరం 5వ చిత్రంగా కోడి రామకృష్ణ బ్యానర్ పై ఆయన కూతురు దివ్య నిర్మాతగా సినిమా వస్తోంది. 6వ చిత్రంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. 7వ చిత్రాన్ని గీతాఆర్ట్స్-2లో, 8వ చిత్రాన్ని ఏఎం రత్నంకు, 9వ సినిమాను ఏషియన్ సినిమాస్ బ్యానర్ కు, 10వ సినిమాను ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థకు చేయబోతున్నాడు ఈ హీరో.
ఇలా వరుసపెట్టి సినిమాలు లైన్లో పెట్టాడు కిరణ్ అబ్బవరం. అలా తనకున్న క్రేజ్ చూపించుకున్నాడు. ఐతే, తాజాగా రిలీజైన ‘సెబాస్టియన్’ సినిమా స్పీడ్ బ్రేకర్ గా మారింది. ఈ సినిమా రిజల్ట్ కిరణ్ అబ్బవరం ట్రాక్ రికార్డ్ పై గట్టిగా పడేలా ఉంది. రాజావారు-రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలతో వచ్చిన క్రేజ్ ను సెబాస్టియన్ తో కొనసాగించలేకపోయాడు ఈ హీరో.
సినిమా అనేది ఓ ప్రయత్నం. క్లిక్ అవుతుందా అవ్వదా అనేది మేకర్స్ చేతిలో ఉండదు. కానీ ఎటువంటి అండలేకుండా వచ్చిన హీరోలు మరింత జాగ్రత్తగా వర్క్ చెయ్యాలి.
కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న టైమ్ లో కిరణ్ అబ్బవరం మరింత కేర్ తీసుకోవాలి. ఎంచుకునే కథల విషయంలోనే కాకుండా, స్క్రీన్ ప్లే పై కూడా దృష్టిపెట్టాలి. ఎంత కేర్ ఫుల్ గా ఉంటే అంత మంచిది.