కొత్త డేట్ విషయంలో కుస్తీ

Samantha in Shaakuntalam

‘శాకుంతలం’ సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. తాజాగా మరో సారి డేట్ మార్చుకొంది. ఈ నెల 17న విడుదల కావాల్సిన ‘శాకుంతలం’ ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. సినిమా డేట్ ని ఎందుకు మార్చారు అనే విషయంలో కూడా సరైన సమాధానం లేదు.

ఇక ఇప్పుడు కొత్త డేట్ విషయంలో కుస్తీ మొదలైంది. వేసవి సెలవుల్లో విడుదల చేస్తే పాన్ ఇండియన్ సినిమాల వసూళ్లకు ఢోకా ఉండదు అని టాక్. ఐతే, ఏప్రిల్ నెలలో రవితేజ ‘రావణాసుర’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’, మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రాలు బరిలో ఉన్నాయి. వీటిలో ఏ సినిమాతో పోటీ పడినా ఇబ్బందే.

ఇక మే నెలలో సమంత మాజీ భర్త నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, పాన్ ఇండియన్ ఫాంటసీ సినిమా ‘హను మాన్’ చిత్రాలు బరిలో ఉన్నాయి. సో, ఈ సినిమాకి సరైన డేట్ మే చివరి వారం. తెలుగుతో పాటు, హిందీలో కూడా విడుదల కానుంది.

అన్ని భాషల్లో బెస్ట్ డేట్ కావాలి. ఈ విషయంలోనే దర్శక, నిర్మాత గుణశేఖర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ప్రెజెంటర్ దిల్ రాజు. మారి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయేమో.

Advertisement
 

More

Related Stories