ఈ ఏడాది మూడోది కన్ఫర్మ్

Shah Rukh Khan

షారుక్ ఖాన్ ని కింగ్ ఖాన్ అంటారు. కానీ బాక్సాఫీస్ ‘కింగ్’ అనే తన పేరుకు ఆ మధ్య దెబ్బ తగిలింది. వరుసగా ఫ్లాప్స్ రావడంతో గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ ఆయనకి మంచే చేసింది. ఇప్పుడు వరుసగా భారీ హిట్స్. ఒకే ఏడాది రెండు చిత్రాలు విడుదల చేసి… రెండూ 500 కోట్లపైగా వసూళ్లు సాదించండం అంటే మాటలు కాదు కదా. ఆ రికార్డు మరో హీరోకి లేదు ఇండియాలో.

ఇక ఇంతటితో ఆగేది లేదు అంటున్నారు షారుక్. ఈ ఊపు కంటిన్యూ కానుంది. “జవాన్” విడుదలై వారం రోజుల తర్వాత షారుక్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రిస్మస్ కి మూడో సినిమా విడుదల అవుతుంది అనిప్రకటించారు షారుక్. “డంకి” సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వాయిదా పడింది అన్న పుకారులో నిజం లేదని షారుక్ తాజా ప్రకటనతో తేలిపోయింది.

“2023 ‘పఠాన్’తో ఘనంగా మొదలైంది. రిపబ్లిక్ డే కానుకగా ఆ సినిమా వచ్చింది. రిపబ్లిక్ డే మనందరికి ప్రత్యేకమైన రోజు. ఇక ‘జవాన్’ కృష్ణష్టామి నాడు వచ్చింది. విజయం సాధించి. క్రిస్మస్ కి ‘డంకి’ వస్తుంది. సమైక్యత అంటే ఇదే కదా. ఇంకా నా ప్రతి సినిమా విడుదల ఒక ఈద్ పండుగ లాంటిదే కదా,” అని చమత్కరించారు షారుక్.

రాజ్ కుమార్ హిరానీ తీస్తున్న ‘డంకి’ కూడా 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంటే ఆ రికార్డుని ఇంకో హీరో బ్రేక్ చెయ్యడం అసాధ్యం అవుతుంది. ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదలచెయ్యగలగడం, ఆ మూడింటికీ 500 కోట్లకు పైగా వసూళ్లు తీసుకురాగలడం సులువా చెప్పండి?

More

Related Stories