ఆ కమెడియన్ అడుక్కున్నాడు, ఎందుకు?

కమెడియన్ షకలక శంకర్ రోడ్డున పడ్డాడు. నడివీధిలో భిక్షాటన చేశాడు. అయితే ఇదంతా గతిలేక ఆయన చేయలేదు. ఓ మంచి పని కోసం ఇలా నలుగురి ముందు చేయిచాచాడు ఈ హాస్యనటుడు.

కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టాడు శంకర్. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా… మిగిలిన డబ్బులు తను జోడించి… మొత్తం లక్ష రూపాయలతో… కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాడు.

ఇకపై నెలకొకసారి ఇలాంటి పని చేసి పేదవారికి సాయపడతానంటున్నాడు శంకర్. తాజాగా ఈ నటుడు ఓ రైతు కూలీ కుటుంబానికి లక్షా 10వేలు వెచ్చించి కాడెద్దులు, నాగలి అందించాడు.

Related Stories